తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ సందడి

Bheemla Nayak: ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ.. థియేటర్లలోకి వచ్చిన భీమ్లానాయక్

Rama Rao
Published on: 25 Feb 2022 9:49 AM IST
Pawan Kalyan Fans are Buzzing at the Theaters
X

తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ సందడి

Bheemla Nayak: పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. భీమ్లా నాయక్‌ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ భీమ్లా నాయక్‌ థియేటర్లలోకి వచ్చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్‌ సందడి మాములుగా లేదు. ఉదయం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల సినిమా ప్రీమియర్‌ షోలు పడగా, సినిమా మంచి పాజిటివ్‌ టాక్‌తో నడుస్తోంది. విజయవాడ, గుంటూరు, విశాఖ, వరంగల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. భీమ్లా నాయక్‌ సినిమాకు తెలంగాణలో 5 షోలకు అనుమతిచ్చింది. ఇందులో భాగంగానే హైదారాబాద్‌లోని పలు థియేటర్లలో బెన్‌ఫిట్‌ షోలకు అనుమతిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story