వరంగల్ ఎంజీఎం లో పడకేసిన రక్త, మూత్ర పరీక్ష పరికరాలు

వరంగల్ ఎంజీఎం లో పడకేసిన రక్త, మూత్ర పరీక్ష పరికరాలు
x

వరంగల్ ఎంజీఎం లో పడకేసిన రక్త, మూత్ర పరీక్ష పరికరాలు


Highlights

రోగ నిర్ధారణలో ముఖ్య పాత్రను పోషించే ఎక్స్‌రే యంత్రాలు సాంకేతిక లోపం కారణంగా పనిచేయడం లేదు. అలాగే శరీర అవయావాల్లో రక్త కణాల శాతం తెలిపే యంత్రాలకు...

రోగ నిర్ధారణలో ముఖ్య పాత్రను పోషించే ఎక్స్‌రే యంత్రాలు సాంకేతిక లోపం కారణంగా పనిచేయడం లేదు. అలాగే శరీర అవయావాల్లో రక్త కణాల శాతం తెలిపే యంత్రాలకు కెమికల్స్ కొరతతో పరీక్షలు జరగటం లేదు. మరమ్మతులు చేయించాల్సిన వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో వరంగల్ ఎంజీఎంలో రోగులు నానా తిప్పలు పడుతున్నారు.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి ఉత్తర తెలంగాణ జిల్లాలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహరాష్ట్ర, ఒరిస్సాకు చెందిన ప్రజలు వైద్య సేవల కోసం వచ్చీపోతుంటారు. ప్రతిరోజు ఓపీ వైద్య విభాగంలో 2500 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. వీరిలో కనీసం 200 మందికి ఎక్స్‌రే తీయించుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. వీరితో పాటు ప్రతిరోజు అత్యవసర వైద్య విభాగం క్యాజువాలిటీలో మెడికల్‌ లీగల్‌ కేసుల్లో సుమారు 150 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేసుకోవాలని డాక్టర్లు చీటీలు రాసి ఇస్తారు.

ఎంజీఎంలో వైద్య సేవల కోసం వచ్చే వారి కోసం ఉచితంగా రక్త, మూత్ర పరీక్షలు చేసి అ నివేదిక ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ పరీక్షలు చేసేందుకు ఎంజీఎంలో 8 యంత్రాలు ఉన్నాయి. నెల రోజుల నుంచి సాంకేతిక లోపం కారణంగా అందులో నాలుగు పడకేసాయి. మరో నాలుగు పని చేస్తున్నాయి. వీటికి తోడుగా శరీరంలోని రక్త కణాల పరీక్షలు చేసేందుకు రియోజన్స్ సప్లయ్ లేక సెల్ కౌంటర్ యంత్రాలు పని చేయటం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఇప్పటికైనా ప్రజా ప్రతినిదులు, అధికారులు ఎంజీఎం ఆసుపత్రి పై దృష్టి సారించి సాంకేతిక లోపంతో పని చేయని యంత్రాలు పని చేసేలా చర్యలు చేపట్టడమే కాదూ. రక్త కణాలు పరిక్షలు చేసే సెల్ కౌంటర్ యంత్రాలకు కెమికల్ అందించి రోగులకు పరిక్షలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories