Gudem Mahipal Reddy: చరిత్రలో నిలిచిపోయే పోరాటయోధుడు సర్దార్ సర్వాయ్ పాపన్న

Gudem Mahipal Reddy: గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగురవేసిన వీరుడు

Shekhar G
Published on: 7 Sept 2023 2:19 PM IST
Patancheru MLA Gudem Mahipal Reddy Unveiled The Statue Of Sardar Sarvai Papanna.
X

Gudem Mahipal Reddy: చరిత్రలో నిలిచిపోయే పోరాటయోధుడు సర్దార్ సర్వాయ్ పాపన్న

Gudem Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో వెలిమల గ్రామంలో సర్దార్ సర్వాయ్ పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పోరాట యోధుడు పాపన్నగౌడ్ అని కొనియాడారు. గోల్కొ్ండ కోటపై బహుజన జెండాను ఎగురవేసి, రాజ్యాధికారం చేపట్టిన వీరుడు పాపన్న అంటూ కీర్తించారు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి. గత చరిత్రను భావి తరాలకు తెలియజేయకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామన్నారు. సమరయోధుల విగ్రహాలు ఏర్పాటుచేసుకోవడమంటే వారి అడుగుజాడల్లో నడుస్తూ వెళ్లడమేనని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి గుర్తుచేశారు.

Shekhar G

Shekhar G

Next Story