వనమా రాఘవ నా భార్యను కోరాడు.. ఎలా పంపగలను? రామకృష్ణ సెల్ఫీ వీడియో వైరల్

Ramakrishna: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 12:17 PM IST
Palvancha Family Suicide Case Ramakrishna Selfie Video Viral
X

వనమా రాఘవ నా భార్యను కోరాడు.. ఎలా పంపగలను? రామకృష్ణ సెల్ఫీ వీడియో వైరల్

Ramakrishna: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. తనకు తన తల్లికి, అక్కకు మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విభేదాలు ఉన్నాయని ఆ వీడియోలు వెల్లడించాడు. పలుమార్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ సమక్షంలో పంచాయితీలు జరిగినట్లు చెప్పుకొచ్చాడు. తన సతీమణి గురించి అసభ్యంగా రాఘవ మాట్లాడారని ఆరోపించారాయన.

ఇంకా సెల్ఫీ వీడియోలో రామకృష్ణ మాట్లాడుతూ.. వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో ఎంత అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. పిల్లలు లేకుండా నా భార్యను హైదరాబాద్‌‌కు ఒంటరిగా తీసుకురావాలని కోరారు. నీ భార్యను నా దగ్గరికి పంపిస్తే నువ్వు అడిగిన పని చేసి పెడతా.. లేకపోతే ఒక్కడు కూడా నీకు సాయం చేసేందుకు ముందుకు రాడని బెదిరించాడు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story