Munugode: కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో.. రేవంత్‌ పరువు నిలబెట్టుకోవాలంటే..

Munugode Politics: కాంగ్రెస్‌లో మునుగోడు బైపోల్‌ రాజకీయం వేడి రాజేస్తోంది.

Arun Chilukuri
Published on: 10 Aug 2022 1:38 PM IST
Palvai Sravanthi Sensational Comments On Congress
X

Munugode: కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో

Munugode Politics: కాంగ్రెస్‌లో మునుగోడు బైపోల్‌ రాజకీయం వేడి రాజేస్తోంది. చల్లమల్ల కృష్ణారెడ్డి తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటుండటంతో ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతికి ఓ కార్యకర్త ఫోన్‌ చేశారు. ఇప్పుడు ఈ ఆడియో టేప్‌ మునుగోడు నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది.

చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్‌ ప్రతిపాదనను పాల్వాయి స్రవంతి వ్యతిరేకిస్తున్నారు. ''చండూరు సభ నా వల్లే సక్సెస్‌ అయ్యింది. కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తే హుజురాబాద్‌ సీన్‌ రిపీట్‌ ఖాయం. ముక్కు, మొహం తెలియని కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తే ఊరుకోను'' అని స్రవంతి తేల్చి చెప్పారు. రేవంత్‌ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచేవారికే టికెట్‌ ఇవ్వాలంటూ స్రవంతి ఆడియో వైరల్‌గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story