Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం

Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
Palle Pragathi: పల్లెల్లో పాత ఇళ్లను కూల్చి కొత్త ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం పల్లె ప్రగతి.
Palle Pragathi: పల్లెల్లో పాత ఇళ్లను కూల్చి కొత్త ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం పల్లె ప్రగతి. ఈ పల్లె ప్రగతి ఏ పల్లెకు మేలు చేసిందో తెలియదు కానీ పాలమూరు జిల్లాలోని ఓ పల్లెను మాత్రం సర్వ నాశనం చేసింది. దాదాపు 60 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను కూల్చి కొత్త ఇళ్ళు కట్టిస్తామని ఏకంగా 48 చెంచు కుటుంబాలను నిరాశ్రయులుగా చేశారు అధికారులు. దీంతో మూడేళ్లుగా నిలువ నీడ లేక ఎండకు ఎండి వానకు తడిచి కాలం వెల్లదీస్తున్న చెంచు కుటుంబాలపై హెచ్‍ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.
పాలకుల నిర్లక్ష్యానికి, అధికారుల అలసత్వానికి పాలమూరు జిల్లాలోని చిన్నయ్యపల్లి గ్రామం నిలువుటద్దంగా మారింది. పల్లెప్రగతి పథకం చెంచుల జీవితాలను అరణ్య రోదనగా చేసింది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను పల్లె ప్రగతి పథకంలో భాగంగా పునర్ నిర్మిస్తామని కూలగొట్టి మూడేళ్లవుతున్నా అతీ గతీ లేకుండా పోయింది. దీంతో గూడు చెదిరి చెంచు కుంటుబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. కొందరు గుడిసెలు వేసుకొని కాలం వెళ్లదీస్తుంటే మరి కొందరు బాతురూంలలో జీవనం సాగిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం చిన్నయ్యపల్లి ఐటీడీఏ కాలనీలో మొత్తం 65 కుటుంబాలు నివాసముంటున్నాయి. 1950-60 మధ్యకాలంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హయాంలో 32 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు హయంలో మరో 16 ఇళ్ళు నిర్మించారు. ఇలా 48 కుటుంబాలు కూలి నాలి చేసుకుంటూ ఉన్న దాంట్లో జీవనం సాగిస్తున్న సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పథకం వీరికి నిలువ నీడ లేకుండా చేసింది. శిథిలావస్తుకు చేరాయన్న కారణం చేత 2019లో 48 ఇళ్లను అధికారులు కూల్చేసారు. వాటి స్థానంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాని మూడేళ్లవుతున్నా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఇళ్ల నిర్మాణం కాలేదు.
ఉన్న కాస్త ఇళ్లను కూల్చడంతో విష సర్పాల మధ్య పిల్లా జెల్లాతో నివాసముంటున్నాయి చెంచు కుటుంబాలు. పాముకాట్లకు గురై ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఐనా అధికారుల్లో చలనం లేదు. చెంచుల ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ప్రాణ భయం వెంటాడుతున్నా గత్యంతరం లేక రక్షణ లేని బతుకులను భారంగా మోస్తున్నారు. మొత్తానికి అధికారుల తీరు చెంచుల బతుకులను మరింత భారం చేస్తే ఇళ‌్లుంటే చాలు ఏదో పని చేసుకొని బతుకుతామంటున్నారు బాధితులు. తమపై కనికరం చూపి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వేడుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
థానే మున్సిపల్ కార్పొరేటర్ నుంచి సీఎం వరకు.. అనూహ్యంగా దూసుకొచ్చిన...
30 Jun 2022 2:01 PM GMTPM Modi Hyderabad Tour: బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ తీర్థం...
30 Jun 2022 1:53 PM GMTమహా పాలిటిక్స్‌లో ట్విస్ట్లే ట్విస్ట్‌లు.. బీజేపీ చీఫ్ నడ్డా...
30 Jun 2022 1:43 PM GMTPSLV C-53 రాకెట్ ప్రయోగం సక్సెస్..
30 Jun 2022 1:34 PM GMTHealth Tips: శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరగడానికి ఇవే ముఖ్య కారణాలు..!
30 Jun 2022 1:30 PM GMT