MLC Elections: నాలుగో రౌండ్‌లోనూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యం

MLC Elections: నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.

Arun Chilukuri
Published on: 18 March 2021 3:52 PM IST
Palla Rajeshwar Reddy Leads in Graduate MLC Seat
X

MLC Elections: నాలుగో రౌండ్‌లోనూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యం

MLC Elections: నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నాలుగో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యాయి. నాలుగో రౌండ్ వచ్చే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 17 వేల 100 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 13వేల 500 ఓట్లు.. కోదండరామ్‌కు 11 వేల 917 ఓట్లు వచ్చాయి. మొత్తం నాలుగు రౌండ్లు కలిపి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 64 వేల 645 ఓట్లు వచ్చాయి. 48 వేల 364 ఓట్లతో రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. 41 వేల 477 ఓట్లతో మూడో స్థానంలో కోదండరామ్‌ ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story