Neelam Madhu: త్వరలో ముదిరాజ్‌లను బీసీ "డి" నుంచి.. బీసీ "ఏ" లోకి మార్చేలా కృషి చేస్తా

Neelam Madhu: ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతించిన నీలం మధు

Shekhar G
Updated on: 13 March 2024 7:15 PM IST
Palabhishekam for CM Revanth Flexi By Neelam Madhu
X

Neelam Madhu: త్వరలో ముదిరాజ్‌లను బీసీ "డి" నుంచి.. బీసీ "ఏ" లోకి మార్చేలా కృషి చేస్తా

Neelam Madhu: కాంగ్రెస్‌ ప్రభుత్వం 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. చిట్కూల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారని ఈ సందర్భంగా నీలం మధు కొనియాడారు. త్వరలోనే ముదిరాజ్‌లను బీసీ డీ నుండి బీసీ ఏలోకి మార్చే విధంగా కృషి చేస్తానని నీలం మధు ముదిరాజ్‌ స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story