బెడిసి కొట్టిన ఆన్‌లైన్‌ ప్రేమ వ్యవహారం.. హైదరాబాద్‌ యువకుడితో పాకిస్తానీ యువతి ప్రేమాయణం

Indo-Nepal Border: ఆమె పేరు కలీజానూర్.. పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ అతడి పేరు అహ్మద్ హైదరాబాద్ ఇద్దరూ ఆన్‌లైన్‌లో పరిచయమయ్యారు.

Arun Chilukuri
Published on: 11 Aug 2022 2:47 PM IST
Pakistan Woman in Love With Hyderabad man held on Indo-Nepal Border
X

బెడిసి కొట్టిన ఆన్‌లైన్‌ ప్రేమ వ్యవహారం.. హైదరాబాద్‌ యువకుడితో పాకిస్తానీ యువతి ప్రేమాయణం

Indo-Nepal Border: ఆమె పేరు కలీజానూర్.. పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ అతడి పేరు అహ్మద్ హైదరాబాద్ ఇద్దరూ ఆన్‌లైన్‌లో పరిచయమయ్యారు. మెల్లగా మాటలు కలిశాయి. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించకపోవడంతో కలీజానూర్ పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చేందుకు సిద్ధమైంది.

హైదరాబాద్‌లోని ఆమె ప్రియుడు అహ్మద్ ఇందుకోసం పెద్ద ప్లానే వేశాడు. తన సోదరుడు మహమూద్ సహకారంతో కలీజానూర్ హైదరాబాదీగా నమ్మించేందుకు నకిలీ ఆధార్ కార్డు సృష్టించాడు. నేపాల్ మీదుగా ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. భారత్–నేపాల్ సరిహద్దు బిహార్‌లోని సుర్సంద్ వద్ద యువతి, అక్రమంగా ఇండియాలోకి రావడానికి సహకరిస్తున్న మరో ఇద్దరు సైన్యానికి పట్టుబడ్డారు. సైన్యం వారిని స్థానిక పోలీసులకు అప్పగించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story