Kaushik Reddy: 'కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకొని తిరగండి'

Kaushik Reddy: గిఫ్ట్ కింద గాజులు, చీరలు పంపిస్తున్నా అంటూ మీడియా ముందే ప్రదర్శన

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 Sept 2024 4:01 PM IST
Padi Kaushik Reddy made sensational comments on defecting MLAs
X

Kaushik Reddy:'కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకొని తిరగండి'

Kaushik Reddy: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. హైకోర్టు ఆదేశాలను కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు తీర్పుతో 10 మంది ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్.

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకుని తిరగండంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గిఫ్ట్ కింద గాజులు, చీరలు పంపిస్తున్నా అంటూ వాటిని మీడియా ముందే ప్రదర్శించారు పాడి కౌశిక్‌రెడ్డి. దానం నాగేందర్, కడియం శ్రీహరి చీటర్, మోసగాళ్లు అంటూ ఘాటుగా స్పందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story