Peddapalli: అన్నదాతలను ముంచేసిన అకాల వర్షాలు

*వర్షపు నీటిలో కొట్టుకుపోయిన వరి ధాన్యం *వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలు *మొలకలుగా మారుతున్న తడిసిన ధాన్యం

Shilpa
Updated on: 20 Nov 2021 10:52 AM IST
Paddy Grains were Completely Drained at Grain Purchasing Centre due to Heavy Rains in Peddhapalli
X

మొలకలుగా మారుతున్న తడిసిన ధాన్యం(ఫైల్ ఫోటో)

Peddapalli: అకాల వర్షం అన్నదాతలు పండించిన వరిధాన్యాన్ని నిండా ముంచేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కోనుగోలు కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా వరిధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. వర్షపు నీటిలో ధాన్యం గింజలు కూడా కొట్టుకుపోయాయి.

ఇక నెలరోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కల్లాలలో వరిధాన్యం తడిసి మొలకలుగా మారుతోంది. గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు పడుతున్నారు అన్నదాతలు.

Shilpa

Shilpa

Next Story