Nagarjuna Sagar: సాగర్ బీజేపీ అభ్యర్ధి ఖరారు

Nagarjuna Sagar: టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు పోటీగా ఎస్టీని బరిలోకి దింపిన బీజేపీ

Sandeep Eggoju
Updated on: 30 March 2021 12:22 PM IST
Paanugothu Ravikumar As Nagarjuna Sagar BJP Candidate
X

ఫైల్ ఫోటో 

Nagarjuna Sagar: అధికార టీఆర్ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌కు పోటీగా ఎస్టీని బరిలోకి దింపింది బీజేపీ. మొదట్నుంచీ ప్రచారం జరుగుతున్నట్లే డాక్టర్ రవినాయక్‌‌కు సాగర్ టికెట్‌ను కేటాయించింది. తీవ్ర తర్జనభర్జనల తర్వాత రవికుమార్ నాయక్‌ వైపే బీజేపీ మొగ్గుచూపింది. నియోజకవర్గంలోని కుల సమీకరణలను పరిగణలోకి తీసుకున్న కమలనాథులు చివరికి రవినాయక్‌కు సాగర్ టికెట్‌ను కట్టబెట్టారు.

నాగార్జునసాగర్‌లో ఎస్టీల ఓట్లు 40వేలకు పైగా ఉండటంతో ఆ ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయని బీజేపీ భావిస్తోంది.ప్రభుత్వ వైద్యుడుగా, సివిల్ సర్జన్‌గా పనిచేసిన రవినాయక్‌కు స్థానికంగా మంచి పేరుంది. అలాగే, నిర్మల ఫౌండేషన్‌ పేరుతో సామాజిక కార్యక్రమాల చేపట్టడంతో ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇలా, రవినాయక్ ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ బీజేపీ విజయానికి కలిసి వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story