బండి సంజయ్ పై సొంతపార్టీ నేతలే విమర్శలు

* బండి సంజయ్ పై మరోనేత శేఖర్ విమర్శలు

Dhatripriya
Published on: 13 March 2023 12:46 PM IST
Own Party Leaders Criticized Bandi Sanjay
X

బండి సంజయ్ పై సొంతపార్టీ నేతలే విమర్శలు

Bandi Sanjay: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఎంపి అరవింద్ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే మరో నేత కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత పెరల శేఖర్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యల్నిసమర్థించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చేయాల్సిన పనిని అరవింద్ చేశారని శేఖర్ వ్యాఖ్యానించారు.బండి సంజయ్ పరిణితిలేని వ్యాఖ్యలు చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్నచందాన సాగుతుందన్నారు. ఈ మేరకు శేఖర్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story