Top
logo

కరోనాపై మా అంచనాలు నిజమవుతున్నాయ్: ప్రజారోగ్య డైరెక్టర్

కరోనాపై మా అంచనాలు నిజమవుతున్నాయ్: ప్రజారోగ్య డైరెక్టర్
X
Highlights

తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌...

తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ కోఠిలోని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డీఎంఈ రమేశ్‌ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ మాసంలో కరోనా పాజిటివ్‌ రేటు అత్యధికంగా 23 శాతం నమోదు కాగా.. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు 4 శాతం మాత్రమే ఉందని ఆయన అన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి కొవిడ్ కేసులు తగ్గుతాయనే అంచనాలు నిజమవుతున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 15.42 శాతం మాత్రమే యాక్టివ్ కేసులున్నాయని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం మంది పొరుగు రాష్ట్రాల వారు చికిత్స పొందుతున్నారని అన్నారు. కొవిడ్‌కి ముందు ఆ తర్వాత అనేలా జనజీవనం ఉంటోందని శ్రీనివాస్ అన్నారు.

కరోనా పరీక్షలు చేయడంలో రాష్ట్రం ప్రణాళికాబద్ధంగానే వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రోజుకు సగటున 55 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి 10 లక్షల మందిలో 79 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కరోనా పడకలకి ఆక్సిజన్‌ సరఫరా ఉందని డీఎంఈ రమేష్ రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 230 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.59 శాతం మాత్రమే ఉందని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ వెల్లడించారు. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కేసుల సంఖ్య కొంత ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాదాపూర్‌, హైటెక్‌ సిటీలో కేసులు తగ్గుముఖం పట్టినా జనజీవనం సాధారణ స్థితికి రాలేదని. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించలేదని చెప్పారు. మరో 12 వేలకు పైగా పడకలకు ఆక్సిజన్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. కొవిడ్‌ పరిస్థితులు తొలి నుంచీ అంచనాలకు తగ్గట్లుగానే ఉన్నాయని అన్నారు.

Web Titleover covid status public health director srinivas reddy conducts press conference
Next Story