తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు...22 మంది అవుట్‌

తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు...22 మంది అవుట్‌
x
Highlights

-తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలపై వీసీ ఆగ్రహం -అక్రమ నియామకాలు, పదోన్నతులపై hmtvలో కథనం -అకమ్మకానికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు పేరుతో hmtvలో కథనాలు -hmtv కథనాలకు స్పందించిన ఇంచార్జ్‌ వీసీ అనీల్‌ కుమార్‌ -అనుమతులు లేకుండా నియమించిన 22 మందిని తొలగిచాలని ఆదేశం -జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన 17మంది పదోన్నతుల రద్దు -ఇష్టారాజ్యంగా ఔట్‌సోర్సింగ్‌ నియామకాలపై కమిటీ ఏర్పాటు -ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు -hmtv కథనాలపై హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకంపై హెచ్‌ఎంటీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై వర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీ అనీల్‌ కుమార్‌ స్పందించారు. అక్రమ నియామకాలు, పదోన్నతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా నియమించిన 22 మంది ఔట్‌ సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలని ఇన్‌చార్జ్‌ వీసీ ఆదేశించారు. ఇష్టారాజ్యమైన ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలపై ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అనీల్‌ కుమార్‌ తెలిపారు. ఈ క్రమంలో జూనియర్‌ అసిస్టెంట్స్‌గా పదోన్నతులు పొందిన 17 మంది ఔట్‌ సోర్సింగ్‌ పదోన్నతులు రద్దు చేశారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు వివాదస్పదంగా మారాయి. వర్సిటీకి చెందిన ఓ కీలక అధికారి సిబ్బందితో చేయి కలిపి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టారు. అవసరం లేకున్నా.. అటెండర్లు, సెక్యూరిటీ గార్డులను ఇబ్బడి ముబ్బడిగా భర్తీ చేశారు. ఒక్కో ఉద్యోగానికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక్కడ ఉద్యోగాల భర్తీ కోసం ఇది వరకే పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ ప్రమోషన్లలోను భారీగా వసూళ్లకు తెరలేపినట్లు ప్రచారం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 30 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడం పట్ల పలు విద్యార్ధి సంఘాలు ఇంచార్జీ వీసీ అనిల్ కుమార్ తో పాటు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వీసీ సాంబయ్య పదవీ విరమణ అనంతరం ఈ నియామకాలు జరిగాయి.

యూనివర్సిటీలో భూములు కొల్పోయిన బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నా.. వారిలో ఇప్పటికీ కొందరు అధికారులు చుట్టు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇంకొందరు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందారు. ఇలా అనేక అక్రమాలకు తెలంగాణ యూనివర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఐతే యూనివర్సిటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాలపై అంశాన్ని ఇంచార్జీ వీసీ, సీనియర్ ఐఏఎస్ అనిల్ కుమార్ దృష్టికి హెచ్‌ఎంటీవీ తీసుకెళ్లింది. అక్రమ నియామకాలు జరిగితే రద్దు చేస్తామని, సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్‌ఎంటీవీకి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories