పేరెంతో ఘనం, సౌకర్యాలు శూన్యం.. ఓయూలో సమస్యల తిష్ట.. అన్నంలో పురుగులు, బాత్‌రూమ్‌లకు లేని..

Osmania University Students Facing Food Problems and Poor Bathroom Facilities | Live News
x

పేరెంతో ఘనం, సౌకర్యాలు శూన్యం.. ఓయూలో సమస్యల తిష్ట.. అన్నంలో పురుగులు, బాత్‌రూమ్‌లకు లేని..

Highlights

Osmania University: సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్న విద్యార్థినులు...

Osmania University: వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటి.. విద్యార్ధులకు శాపంగా మారింది. మహిళ హస్టల్స్ నిత్యం సమస్యలకు కేరాఫ్ గా మారుతున్నాయి.యూనివర్సిటిలో తిన్న ఆహారం కారణంగా విద్యార్ధులు ఫుడ్ పాయిజన్ తో హస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం నిత్యం వందలాది మంది అమ్మాయిలు రోడ్డెక్కుతున్నారు. కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్ధినీలు అందోళన బాట పడుతున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో స్టూడెంట్లు రోడ్డెక్కుతున్నారు. అన్నంలో పురుగులొస్తున్నాయని.. పెరుగు, కూరలు సరిగా ఉండడంలేదని, బాత్రూమ్‌లకు డోర్లు, లాక్‌లు లేవని ఓయూ క్యాంపస్ లో విద్యార్ధినిలు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఫుడ్, హాస్టల్ సౌకర్యాలపై అధికారులు స్పందిచడం లేదని ఆరోపిస్తున్నారు.సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించే అమ్మాయిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.

వరస సమస్యలతో విద్యార్ధినిలు ఇబ్డందులు పడుతున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వందలాది మంది అమ్మాయిలు పురుగుల అన్నం, కూరలతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఓయూ లేడీస్ హాస్టళ్లలో ప్రస్తుతం 5 వేల మంది అమ్మాయిలు చదువుతున్నారు. వారి కోసం నాలుగు మెస్‌లు రన్ చేస్తున్నారు. మెను ప్రకారం రోజూ బ్రేక్ ఫాస్ట్ లో కిచిడి, చపాతి, ఊతప్ప, పూరి, దోశ, ఇడ్లీ పెట్టాల్సి ఉన్నా.. ఇడ్లీ, పూరీలతోనే సరిపెడుతున్నారు. వాటి కోసం కూడా గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యూనివర్సిటిలో గతంలో వారంలో రెండు సార్లు నాన్‌వెజ్ పెట్టేవారు. ప్రతి బుధవారం 150 గ్రాముల మటన్, ప్రతి ఆదివారం 250 గ్రాముల చికెన్ ఇచ్చేవారు. కొంతకాలంగా మటన్ ఆపేసిన అధికారులు.. ప్రస్తుతం చికెన్ మాత్రం ఇస్తున్నారని విద్యార్ధినిలు చెబుతున్నారు. అది కూడా100 గ్రాములకు మించడం లేదని అమ్మాయిలు చెబుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఓయూ క్యాంపస్‌లో ఆహారమే కాదు కనీసం తాగు నీటి సౌకర్యం లేదు. తాగు నీటి కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేయిట్ చేయాల్సిన పరిస్ధితులు ఉన్నాయని చెబుతున్నారు. నీటి సరఫరా సరిగా లేకపోవడంతో టాయిలెట్స్ కంపుకొడుతున్నాయని చెబుతున్నారు.. మెస్‌లు ఉన్నప్పుడు మాత్రమే మంచి నీళ్లు వదులుతుండటంతో తాగునీటికి తిప్పలు తప్పట్లేదు.

వాయిస్ఃహస్టల్ కిటికీలు సరిగా లేక గదుల్లోకి తరచూ పాములు వస్తున్నాయని అధికారులకు చెబుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్యాంపస్ నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీ, నిజామ్ కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు మధ్యాహ్నం లంచ్ బాక్సు ఇవ్వడం లేదు. దీంతో వారు మధ్యాహ్నం ఆకలితోనే క్లాసులకు అటెండ్ కావాల్సి వస్తోంది.రాత్రి సమయంలో సరిపడ బోజనం వండక పోవడంతో మరింత ఇబ్బందులు పబుతున్నామని అడిగితే ఎంత వండితే అంతే ఉంటుదనే నిర్లక్షపు సమాధానాలు వస్తున్నాయని అమ్మాయిలు చెబుతున్నారు.

క్యాంపస్‌లో ఈ ఏడాది అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారితో మెస్, హాస్టల్‌కు 10 వేలు డిపాజిట్ కట్టించుకున్న అధికారులు వారికి ఇప్పటి వరకు రూమ్స్ కేటాయించలేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం లేకపోవడంతో కొంత మంది సీనియర్ల గదుల్లో, మరికొంత మంది టీవీ హాల్స్, లైబ్రరీ హాల్లో ఉంటున్నారు. ఒకే బెడ్ లో ఇద్దరు అడ్జెట్స్ అవుతున్న పరిస్ధితులు ఉన్నాయి. హస్టల్ లో నాణ్యత ప్రమాణాలు లేని భోజనం కారణంగా అమ్మాయిలకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన అమ్మాయి హెచ్ ఎంటివికి సమస్యను తెలిపింది.

ఓయూ విద్యార్ధినిలు ఫూడ్ పాయిజన్ తో హస్పటల్స్ లో జాయిన్ అవుతున్నా సమస్యల పరిష్కారం మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తి స్ధాయిలో సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories