హైకోర్టు సీజే ఎదుట ఓయూ ప్రొఫెసర్ కాశీం..

హైకోర్టు సీజే ఎదుట ఓయూ ప్రొఫెసర్ కాశీం..
x
professor Kasim file photo
Highlights

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ చింతకింది కాశీంను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ చింతకింది కాశీంను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పౌర హక్కుల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో అత్యవసర విచారణ చేపట్టిన సీజే ఆదివారం ఉదయం కాశింను తమ ముందు హాజరుపర్చాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ఎస్ చౌహాన్ ముందు గజ్వేల్ పోలీసులు హాజరుపరిచారు.

ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కాశీంను అరెస్టు చేయడంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాశింను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు వారితో పాటు ప్రజాసంఘాలు హైకోర్టు సీజే ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రదేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు వారిని అదుపు చేసేందుకు భారీగా బలగాలను మోహరించారు.

శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆయన ఇంట్లో సోదాలు చేసి అనంతరం ఆయన్ని అరెస్టు చేసారు. ఈ ఉదయం కాశీం ఇంటికి చేరుకున్న పోలీసులు మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సోదాల సందర్భంగా ఆయన ఇంటి దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కాశీం ఇటీవలే విప్లవం సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ప్రొఫెసర్‌ కాశీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే సోదాలు జరుగుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ములుగు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ కేసులో కాశీం ఏ-2గా ఉన్నారు. నాడు కాశీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో మరోసారి సెర్చ్‌ వారెంట్లతో సోదాలు చేస్తున్నామని వెల్లడించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories