కాగజ్‌నగర్‌లో ఆపరేషన్ టైగర్.. ప్రత్యేక బృందాలను రంగంలోకి !

operation tiger in kagaznagar
x
Highlights

కొమ్రుంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఆపరేషన్ టైగర్ కంటిన్యూ అవుతోంది. మనుషులను చంపిన పెద్ద పులి కోసం అధికారులు అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. పులిని...

కొమ్రుంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఆపరేషన్ టైగర్ కంటిన్యూ అవుతోంది. మనుషులను చంపిన పెద్ద పులి కోసం అధికారులు అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. జిల్లాలో నవంబర్ నెలలో ఇద్దరిని పొట్టన పెట్టుకున్న పులి.. దిగడలో మరో వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో హుటాహుటిన పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు.

మరోవైపు నిన్నటి నుంచి అధికారులు అడవుల్లోనే వేటాడుతున్నారు. పులిని పట్టుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అటవీశాఖ అధికారి వినోద్ కుమార్ వెల్లడించారు. బేజ్జుర్ అటవీ గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. పులి సంచరించే 8 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. మత్తు మందు ఇచ్చే షూటర్లతో అధికారులు సిద్ధంగా ఉన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

అటు పులి సంచరించే 8 ప్రాంతాల్లో నిఘా పెట్టారు. పులికి మత్తు మందు ఇచ్చేందుకు వందల కొద్దీ ట్రాక్ కెమెరాలు, 14 బోన్లు ఏర్పాటు చేశారు. 40 మంది వరకు యానిమల్ ట్రాకర్స్ పులి ఆనవాళ్లు గుర్తించే పనిలో ఉన్నారు. ఈసారి కచ్చితంగా పులిని పట్టుకుంటామంటున్నారు అటవీశాఖ అధికారులు. పులి సంచరిస్తుందని అనుమానం ఉన్న తలాయి, గుండ్లపల్లి, కందిభీమన్న అటవీ ప్రాంతాల్లో మంచెలు ఏర్పాటు చేశారు. ఈ మంచెలపై నుంచే పులికి మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొత్తానికి కొద్ది రోజుల్లోనే పులిని పట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు అటవీశాఖ అధికారులు. నిన్నటి నుంచి అడవుల్లోనే అధికారులు మకాం వేశారు. తెలంగాణ నుంచి ప్రవీణ్, మహారాష్ట్ర తడోబా టీమ్ నుంచి రవికాంత్ కొబ్రగడే నిపుణులతో ఈ ఆపరేషణ్ కొనసాగుతోంది. మంచేల మీద నుంచి నిపుణులైన షూటర్స్ తో మత్తు మందు ప్రయోగం చేయనున్నారు అధికారులు. మరిన్ని బొన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. పులి చిక్కితే వెంటనే తరలించేందుకు సైతం ఏర్పాట్లు చేశారు. మంచెలపై ఉండి పులి కోసం ఎదురు చూస్తున్నారు మత్తు ఇచ్చే నిపుణులు. ఇప్పటి కే ఆపరేషన్ జరిగే బేజ్జూరు అటవీ ప్రాంతం వైపు ఎవరు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories