వైఎస్సార్‌టీపీ ప్రధాన అజెండా మూడే అంశాలు- YS Sharmila

YS Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ప్రధాన అంజెడా మూడే మూడు అంశాలని అన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.

Arun Chilukuri
Updated on: 8 July 2021 8:31 PM IST
Only Three Agendas for YSRTP, Says YS Sharmila
X

వైఎస్సార్‌టీపీ ప్రధాన అజెండా మూడే అంశాలు- YS Sharmila

YS Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ప్రధాన అంజెడా మూడే మూడు అంశాలని అన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. సంక్షేమం, స్వయం సంవృద్ధి, సమానత్వమే లక్ష్యమని ఆమె చెప్పారు. హైదరాబాద్‌ జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాల్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించిన షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృష్టి చేస్తామన్నారు. కోట్లాది ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ది చెక్కు చెదరని రూపమని, శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని చెప్పారు షర్మిల. వైఎస్‌ఆర్‌ రాజకీయాలకతీతంగా సాయం చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం ఆనందదాయకమన్నారు. సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పెట్టినట్టు చెప్పారు.

రాష్ట్రంలో ఇవాళ్టికి కూడా పేదరికం పోలేదని, పేదరికం నుంచి కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బయటపడిందని విమర్శించారు. సంక్షేమ పాలనలో కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. కేసీఆర్‌ సంక్షేమమంటే గారడీ మాటల గొప్పలు.. చేతికి చిప్పలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజలు ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ పాలనను తలచుకుంటున్నారన్నారు. పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ లక్ష్యమని షర్మిల స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story