ఆన్‌లైన్‌ షాపింగ్‌ బెస్ట్‌ అంటున్న హైదరాబాదీలు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ బెస్ట్‌ అంటున్న హైదరాబాదీలు
x
Highlights

Online shopping: కరోనా భయం ఇంకా తెలంగాణా ప్రజలను వెన్నాడుతూనే ఉంది. దీంతో పండుగ సీజన్ లో షాపింగ్ కు ఎక్కువగా ఆన్ లైన్ పై ఆధారపడుతున్నారు.

పండగ ‌ సీజన్‌ వచ్చిందంటే సిటీలో ఏ షాపు చూసినా, ఏ మాల్‌కు వెళ్లినా కొనుగోలు దారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది ఈ ఏడాది పరిస్థితి. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడ్డ జనం అన్‌లాక్‌ తర్వాత పరిస్థితులు మారినా బయటకు వెళ్లడం లేదు.

సాధారణంగా సిటీలో అక్టోబర్‌, నవంబర్‌లో షాపింగ్‌ సందడి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా దసరా, దీపావళి పండుగలు ఉండటంతో మార్కెట్లో బిజినెస్‌ అధికంగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది ఆ సీన్‌ కనిపించడం లేదు. ముఖ్యంగా కొనుగోలు దారులు లేక మాల్స్‌ అన్నీ వెలవెలబోతున్నాయి. అటు కరోనా నేపథ్యంలో మార్కెట్‌ కు వెళ్లి షాపింగ్‌ చేయాలంటే జనాలు భయపడుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌ షాపింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రజలు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్స్‌‌తో తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నామంటున్నారు హైదరాబాదీలు. కొవిడ్‌ ఎఫెక్ట్‌ ఉండటంతో కాసేపు సరదాగా కూడా బయటకు వెళ్లడం లేదని చెబుతున్నారు. గతంలో అయితే పిల్లలతో కలిసి వెళ్లి గంటల తరబడి షాపింగ్‌ చేసే వాళ్లమన్నారు. ఓ విధంగా ఆన్‌‌లైన్‌ షాపింగ్‌ కూడా బానే ఉందంటున్నారు హైదరాబాద్‌ వాసులు. మొత్తానికి కరోనా నుండి ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడ్డ జనం పండగలకు కూడా బయటకు వెళ్లడం లేదు. ఏదీఏమైనా ఆన్‌లైన్‌ షాపింగ్‌కే ప్రియారిటీ ఇస్తామంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories