Telangana: డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఆన్‌లైన్‌లో తరగతులు

Telangana: జులై 1 నుంచి ఆప్‌లైన్‌ తరగతులంటూ ఇప్పటికే మార్గదర్శకాలు *పాఠశాలల్లో ఆన్‌లైన్‌ విద్యనే బోధించాలని చెప్పిన సీఎం

Sandeep Eggoju
Updated on: 27 Jun 2021 2:16 PM IST
Online Classes for Degree and Engineering Courses in Telangana
X

ఆన్లైన్ తరగతులు (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ప్రయత్నిస్తుంది. జులై 1 నుంచి ఆప్‌లైన్‌ తరగతులంటూ ఇప్పటికే ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే కరోనా నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులను సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. రేపు ఉదడం 10 గంటలకు విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ విద్యావిధానం అమలును ప్రకటించనున్నారు. అయితే డిగ్రీ, పీజీ ఫైనల్‌ ఇయర్ పరీక్షలు నిర్వహించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story