చకచకా తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులు

Ongoing Telangana New Secretariat Construction Works
x

చకచకా తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులు

Highlights

Telangana: సెక్రటేరియట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల

Telangana: తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సచివాలయ పనులు పరిశీలించిన మంత్రి అధికారులను, వర్క్స్ ఏజెన్సీకి దిశానిర్దేశం చేశారు. సెక్రటేరియట్, అమర వీరుల స్మారక చిహ్నం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నాలుగు గంటల పాటు కలియతిరిగి సూచనలు చేశారు. సీఎం చాంబర్, మంత్రుల చాంబర్స్, సెక్రెటరీల చాంబర్స్, వివిధ శాఖలకు సంబంధించిన వర్క్ స్టేషన్ ఏరియా పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్క్ స్టేషన్ ఏరియాలో సీటింగ్, కంప్యూటర్ల ఏర్పాటుతోపాటు ఉద్యోగులకు సౌకర్యాలను పరిశీలించారు. వర్క్ ఏజెన్సీకి వేముల పలు సూచనలు చేశారు.

అధికారులతోనూ మంత్రి సమీక్షించారు సీఎం చాంబర్, మంత్రుల చాంబర్, ఆఫీసర్స్ చాంబర్స్ ఫర్నీచర్ డిజైన్లు ఫైనల్ చేశారు. సీఎం చాంబర్‌తో పాటు వీవీఐపీ లాంజ్‌లో ఉపయోగించే టైల్స్ పరిశీలించారు. గ్రానైట్ ఫ్లోర్ స్టెప్స్ కు వినియోగించే టైల్స్ ను ఫైనలైజ్ చేశారు. కోర్ట్ యార్డ్, ప్రైమ్ ఏరియా లైటింగ్ బిగింపునకు వాడాల్సిన మెటీరియల్స్ ను ఫైనల్ చేశారు. గ్రాండ్ ఎంట్రీ, మెయిన్ డోర్ కు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని రూపొందించిన పలు డిజైన్లు పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనల మేరకు వాటిని ఫైనలైజ్ చేయనున్నారు. గత విజిట్‌లో మంత్రి మ్యాన్ పవర్ పెంచాలని వర్క్స్ ఏజెన్సీని అదేశించారు. అందుకు తగట్టు అప్పుడు 14వందల50 మంది ఉండగా ప్రస్తుతం మ్యాన్ పవర్ 2వేల118 కి పెంచి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. నూతన సచివాలయ నిర్మాణ ఫినిషింగ్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా ఫ్లోర్ వైస్ సమాంతరంగా నిర్మాణ పనులు పూర్తి కావాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులను, వర్క్ ఏజెన్సీని అదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం పనుల పురోగతిని కూడా మంత్రి పరిశీలించారు. మెయిన్ ఎంట్రీ, తెలంగాణ తల్లి విగ్రహం, గార్డెన్ ఏరియా, పైఅంతస్థులో నిరంతరం వెలుగుతున్న జ్యోతి ఆకృతి వచ్చే నిర్మాణ పనులను నేరుగా పరిశీలించారు. ఈ నిర్మాణం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని, ప్రతి పని మనసుపెట్టి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని అధికారులకు గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories