TPCC: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్

* కొండా సురేఖపై ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీ * వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ ముందు డిమాండ్

Sandeep Reddy
Updated on: 30 Sept 2021 1:31 PM IST
Ongoing Suspense Over Huzurabad Bypoll Congress Candidate
X

కొండా సురేఖపై ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీ(ఫైల్ ఫోటో)

TPCC: హుజూరాబాద్ ఉప ఎన్నిక హెడ్యూల్ ఖరారు కావడంతో ఒక్కసారిగా అన్ని రాజకీయ పార్టీల్లో జోష్ పెరిగింది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు.

కొండా సురేఖపై హస్తం పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ ముందు కొండా సురేఖ డిమాండ్ పెట్టారు. దీనిపై హస్తం పార్టీ నేతలు సమాలోచనలు చేస్తునట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story