Hyderabad: సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు కోసం కొనసాగుతున్న వేట

Hyderabad: హైదరాబాద్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న పోలీస్‌ సిబ్బంది

Sandeep Eggoju
Published on: 15 Sept 2021 8:20 PM IST
Ongoing Searching For Saidabad Incident Accused
X

నిందితుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన హైదరాబాద్ పోలీసులు 

Hyderabad: సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. రాజును పట్టించాలంటూ విస్తృతప్రచారం చేస్తున్నారు. ఆటోలు, ఆర్టీసీ బస్‌లకు నిందితుడు పోస్టర్లను అతికిస్తున్నారు. రోడ్లపై ఉన్న జనాలకు రాజు ఫొటోలు చూపిస్తూ నిందితుడ్ని పట్టించాలంటూ కోరుతున్నారు. ఖైరతాబాద్‌ గణేష్‌ మండపం దగ్గర కరపత్రాలు పంచిపెడుతున్న పోలీస్‌ సిబ్బంది. రాజును పట్టించినవారికి పది లక్షల రివార్డు అందజేస్తామని గుర్తుచేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ప్రజలకు సెల్‌ఫోన్లలో రాజు ఫొటో చూపిస్తూ సమాచారం లాగుతున్నారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా వెయ్యి మంది పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఉప్పల్‌ సిగ్నల్‌ దాటిన తర్వాత రాజు కనిపించకుండా పోయాడని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఓ వైన్‌ షాపు దగ్గర రాజు కదలికలను గుర్తించిన పోలీసులు నిందితుడు వాడేసిన కవర్‌, టవల్‌ స్వాధీనం చేసుకున్నారు. అటు కల్లు కంపౌండ్‌, వైన్‌ షాపులు, బస్‌ స్టాప్‌ల దగ్గర మఫ్టీలో పటిష్ఠ నిఘా పెట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story