logo
తెలంగాణ

MLC Elections 2021: కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Ongoing MLC Elections Counting In Telangana
X
ఏంమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 
Highlights

MLC Elections 2021: రెండో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 7 వేల 871 ఓట్లతో ఆధిక్యం

MLC Elections 2021: హైదరాబాద్‌, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 7 వేల 871 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డికి 15వేల 857 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 12వేల70 ఓట్లు, కోదండరాంకు 9వేల 448 ఓట్లు, బీజేపీకి 6వేల 669 ఓట్లు, కాంగ్రెస్‌కు 3వేల 244, రాణిరుద్రమకు 1,634 ఓట్లు వచ్చాయి.

నల్లగొండలో తొలిరౌండ్‌ ముగియగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. మొత్తం 56 వేల ఓట్లలో ఆయనకు 15,990 ఓట్లు వచ్చాయి. అయితే స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 12వేల 567 ఓట్లతో ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. టీజేఎస్‌ అభ్యర్థి కోదండరాం 9 వేలకు పైగా ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. చెల్లని ఓట్లు 3వేల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 3లక్షల 88వేల 11 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. మిగిలినవి కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌, చెరుకు సుధాకర్‌, రాణి రుద్రమ ఇతరులు పంచుకున్నారు.

Web TitleMLC Elections 2021: Ongoing MLC Elections Counting In Telangana
Next Story