Gandhi Hospital: గాంధీ అత్యాచార ఘటనలో కొనసాగుతున్న విచారణ

Gandhi Hospital: మూడు రోజులుగా అనుమానితులను విచారిస్తున్న పోలీసులు

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 12:00 PM IST
Ongoing Investigation on Gandhi Hospital Incident
X

గాంధీ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. మూడు రోజులుగా కీలక అనుమానితులు ఉమా మహేశ్వర్ తో పాటు ముగ్గురు సెక్యురిటీ గార్డులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అనుమానితులు చెప్తున్నట్లు తెలుస్తోంది.

మొదట బాధిత కుటుంబాన్ని గాంధీ ఆస్పత్రి వద్ద సెక్యూరిటీకి పరిచయం చేయలేదని చెప్పాడు ఉమా మహేశ్వర్. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల రాకపోకలకు ఇబ్బంది కలగొద్దనే సెక్యూరిటీకి పరిచయం చేశానని ఒప్పుకున్నాడు. మరోవైపు అనుమానితుల కాల్ డేటాను సైతం పోలీసులు పరిశీలించారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. అసలు సామూహిక లైంగిక దాడి జరిగిందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story