మంచిర్యాల జిల్లా సజీవదహనం కేసులో కొనసాగుతున్న విచారణ

* పోలీసుల అదుపులో శాంతయ్య భార్య, ఇద్దరు కొడుకులు.. ఆటో డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు

R Tripura Malini
Published on: 18 Dec 2022 9:42 AM IST
Ongoing Investigation In The Mancherial District Arson Case
X

మంచిర్యాల జిల్లా సజీవదహనం కేసులో కొనసాగుతున్న విచారణ

Mancherial: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురి సజీవదహనం కేసులో విచారణ కొనసాగుతోంది. శాంతయ్య భార్య, ఇద్దరు కొడుకులు, ఓ ఆటో డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సజీవదహనానికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో గ్రామస్తులను పోలీసులు విచారిస్తున్నారు. సింగరేణిలో ఉద్యోగం ఆస్తి గొడవల వల్లే సజీవహనానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఆస్పత్రి మార్చురీలో శనిగారపు శాంతయ్య మృతదేహాన్ని భద్రపరిచారు. కాగా శాంతయ్య మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులెవరూ ముందుకు రావడం లేదు.

R Tripura Malini

R Tripura Malini

Next Story