Devarayamjal: దేవరయాంజల్‌ భూములపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ

Devarayamjal: 1014 జీవోను సవాల్‌ చేస్తూ పిటిషన్ * కొవిడ్ సమయంలో ఇంత హడావుడి అవసరమా అని ప్రశ్నించిన కోర్టు

Sandeep Eggoju
Updated on: 8 May 2021 5:48 PM IST
Ongoing High Court Hearing on Devarayanjal lands
X

తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Devarayamjal: దేవరయాంజల్‌ భూములపై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈనెల 3వ తేదీన జారీ చేసిన 1014 జీవోను సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలయ్యింది. కొవిడ్ సమయంలో ఇంత హడావుడి అవసరమా అంటూ ప్రశ్నించింది కోర్టు. నలుగురు అధికారులతో కమిటి వేయాల్సిన అవసరం ఏమిటని.. పేపర్‌లో వచ్చిన వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా అంటూ ప్రశ్నించింది. కమిటీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తుందని.. ఎవరినీ ఖాళీ చేయించడం.. ఆక్రమించడం లేదన్నారు అడ్వకేట్‌ జనరల్. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని.. చట్ట ప్రకారమే ప్రభుత్వం వ్యహరిస్తోందన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story