ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన దళితబంధు అవగాహన సదస్సు

Dalita Bandhu: దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం -కేసీఆర్

Sandeep Eggoju
Updated on: 26 July 2021 4:26 PM IST
Ongoing Dalita Bandhu Awareness Meeting in Pragathi Bhavan
X
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Dalita Bandhu: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన దళితబంధు అవగాహన సదస్సు కొనసాగుతోంది. దళితబంధు కేవలం కార్యక్రమం కాదని, ఇదొక ఉద్యమమని అన్నారు సీఎం కేసీఆర్. హుజూరాబాద్‌ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీద.. యావత్‌ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉంటుందన్నారు. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం.. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించిందన్న కేసీఆర్.. ప్రతి విషయంలో ప్రతిశక్తులు ఎప్పుడూ ఉంటాయన్నారు.

నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం సాగించినప్పుడే విజయం సాధ్యం మవుతుందని స్పష్టం చేశారు. అంబేద్కర్‌ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందన్న సీఎం. మనిషిని మనిషి వివక్ష చూపే దుస్థితిపై అధ్యయనం చేశానని, సెంటర్‌ ఫర్‌ సుబాల్టర్న్‌ స్టడీ ద్వారా పరిశీలించానన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story