Vaccination Drive: సింగరేణిలో కొనసాగుతున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

Vaccination Drive: పది రోజులపాటు కొనసాగనున్న వ్యాక్సినేషన్ డ్రైవ్

Sandeep Eggoju
Published on: 13 Jun 2021 11:45 AM IST
Ongoing Covid Vaccination Drive in Singareni
X
సింగరేణిలో వాక్సినేషన్ డ్రైవ్ (ఫైల్ ఇమేజ్)

Vaccination Drive: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్మికులందరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. పది రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాలోని 11 ఏరియాల్లో 29 వేల మందికి టీకాలు వేయాలని నిర్దేశించినట్లు పేర్కొంది. సింగరేణి దవాఖానలు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాళ్లలో సిబ్బందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఇప్పటికే 16వేల మంది కార్మికులకు తొలి డోసు టీకా ఇచ్చామని అన్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణకు సింగరేణి సంస్థ అన్ని తీసుకుంటుందని అధికారులు చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story