Revanth Reddy: కొనసాగుతోన్న కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్‌

Revanth Reddy: కోకాపేట్ పర్యటనకు పిలుపునివ్వడంతో పోలీసుల చర్యలు పీసీసీ చీఫ్ రేవంత్‌, వర్కింగ్ ప్రెసిడెంట్లు హౌస్ అరెస్ట్

Sandeep Eggoju
Updated on: 19 July 2021 11:17 AM IST
Ongoing Congress Leaders House Arrest
X

రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కోకాపేట్ భూముల అమ్మకాల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఇవాళ కోకాపేటలో పర్యటనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతల ఇళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.

పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎంపీ రేవంత్‌రెడ్డిని పార్లమెంట్ సమావేశాలకు వెల్లకుండా అడ్డుకోవడం హక్కులను కాలరాయడమే అంటూ షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. భూముల అమ్మకాల్లో అవినీతిపై ఫిర్యాదు చేస్తానన్నందుకే రేవంత్‌ను అడ్డుకుంటున్నారని ఇది ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట అని ఆరోపించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story