CM KCR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌

CM KCR: సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. జిల్లాలో నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు

Sandeep Eggoju
Updated on: 4 July 2021 5:01 PM IST
Ongoing CM KCR Tour in Rajanna Sircilla District
X

సిరిసిల్లలో సీఎం కెసిఆర్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

CM KCR: సీఎం కేసీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలను ప్రారంభించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమావేశం కానున్నారు. తంగెళ్లపల్లి మండలంలోని మండెపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, వాటి పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

ఇదే గ్రామంలో టైడ్స్‌ను, సిరిసిల్ల మండలంలోని సర్దాపూర్‌లో వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రారంభించనున్నారు. సిరిసిల్ల మండలం రాగుడు గ్రామంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. రోడ్డు మార్గాన జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్‌ రాకను పురస్కరించుకొని శనివారం ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఏర్పాట్లను సమీక్షించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story