కొనసాగుతున్న చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ

Chikoti Praveen: క్యాసినో వ్యవహారం, హవాలా లావాదేవీలపై ఈడీ ప్రశ్నలు

Jyothi
Published on: 1 Aug 2022 1:20 PM IST
Ongoing Chikoti Praveen ED Investigation
X

కొనసాగుతున్న చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ

Chikoti Praveen: క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్‌ ఈడీ విచారణ కొనసాగుతోంది. ప్రవీణ్‌ను ఈడీ అధికారుల వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే సంపత్, మాధవరెడ్డి, బబ్లు, రాకేష్, వెంకట్‌‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సినీ రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక బ్యాంక్ స్టేట్‌మెంట్స్, నోటీస్ కాపీతో చికోటి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. అలాగే అడ్వకేట్‌ను కూడా వెంట తీసుకొచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.

Jyothi

Jyothi

Next Story