అధికారుల నిర్లక్ష్యానికి ఒకరు బలి

One Man Has Died to Officers Negligence
x

Representational Image

Highlights

* మరో నలుగురికి తీవ్ర గాయాలు * రోడ్డు విస్తరణ పనుల్లో GHMC అధికారుల నిర్లక్ష్యం

హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి అయింది. జనావాసల మధ్య ఎన్నో జాగ్రత్తలతో చేయాల్సిన పనిని కాంట్రాక్టుల అలసత్వంతో చేయడంతో ఏం జరిగిందోనని తెలుసుకునే లోపే ఒక నిండు ప్రాణం పోయింది. హైదరాబాద్‌లో కొత్తగూడలో జరిగిన ఈ ఘటన జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడేలా చేసింది.

కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది జీహెచ్‌ఎంసీ. అయితే రోడ్డు కోసం గొయ్యి తీస్తుండగా జేసీబీ తగిలి పక్కనే ఉన్న వైన్‌ షాపు గోడ కూలిపోయింది. వైన్‌ షాపు గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుడు అసోంకు చెందిన ఇనాముల్‌గా గుర్తించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories