Revanth Reddy: రేవంత్ సభలో అపశృతి

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 7 July 2021 5:28 PM IST
One Injures in Revanth Reddys Oath Ceremony
X

Revanth Reddy: రేవంత్ సభలో అపశృతి

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. గాంధీభవన్‌లో జరిగిన సభలో ఓ కార్యకర్తకు గాయం అయ్యింది. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన దీపం వేదిక పైనుంచి జారి పడటం వల్ల కిందనున్న కార్యకర్త తలకు గాయమైంది. వెంటనే అక్కడున్న సేవాదళ్ కార్యకర్తలు, పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. మాజీ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు రేవంత్‌రెడ్డి. ఇక ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story