మరోసారి కార్ రేసింగ్‌కు సిద్ధమైన హుస్సేన్ సాగర్ తీరం.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Once Again Hussain Sagar Is Ready For Car Racing
x

మరోసారి కార్ రేసింగ్‌కు సిద్ధమైన హుస్సేన్ సాగర్ తీరం 

Highlights

* ఈనెల 10, 11 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్

Hyderabad: హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం మరోసారి కార్ రేసింగ్‌కు సిద్ధమవుతోంది. రేపు, ఎల్లుండి ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ రోజు నుంచి ఈనెల 11 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నవంబర్‌లో నిర్వహించిన రేసింగ్‌లో రేసర్లకు ప్రమాదాలు జరగడంతో ట్రయల్‌ రన్‌తోనే సరిపెట్టారు.

మిగతా రెండు సిరీస్‌లను చెన్నైలో నిర్వహించారు. చివరి సిరీస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఐ మ్యాక్స్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్ పార్కు మీదుగా రేసింగ్ ట్రాక్ తిరిగి ఐ మ్యాక్స్ దగ్గర ఉన్న గ్యారేజీకి చేరుకుంటుంది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఫ్లై ఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు నెక్లస్ రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు.

ఈ ట్రాఫిక్‌ను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు. బుద్ధ భవన్-నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వాహనాలను రాణిగంజ్-ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లించారు. రసూల్‌పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్భాల్ మినార్ నుంచి తెలుగు తల్లి, ట్యాంక్‌ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్భాల్ మినార్-రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories