Nalgonda: నల్గొండ కలెక్టరేట్‌ దగ్గర వృద్ధ దంపతుల ఆందోళన

Nalgonda: కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఫ్లెక్సీలతో నిరసన

Sandeep Eggoju
Updated on: 27 July 2021 4:45 PM IST
Old Age Couple Protest at Nalgonda Collectorate
X

నల్గొండ కలెక్టరేట్ (ఫైల్ ఇమేజ్)

Nalgonda: వారసత్వంగా వచ్చిన భూమిని ఇస్తారా.. లేక కారుణ్య మరణానికి అనుమతిస్తారా..? ఇది బెదిరింపు కాదు ఓ వృద్ధ దంపతుల ఆవేదన.! నల్గొండ కలెక్టరేట్ సాక్షిగా కారుణ్య మరణానికి అనుమతివ్వండి అంటూ ఫ్లెక్సీలతో ఆందోళన చేయడం తీవ్ర కలకలం రేపింది. తమకు మాడ్గులపల్లి మండలం కన్నేకల్‌లో వారసత్వంగా వచ్చిన 3.24 గుంటల భూమిని ఇప్పించాలని వేడుకొంటున్నారు.

తమ భూమిని యారమాద చిన్నారెడ్డి అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. అటు అధికారులు కూడా తమను మోసం చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తమ భూమి పట్టా పాస్ పుస్తకాలను మరో వ్యక్తికి ఇచ్చారంటున్నారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలనీ, లేకపోతే కారుణ్య మరణానికైనా అనుమతివ్వాలని కన్నీటి పర్యంతమవుతున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story