Mahabubabad: మహబూబాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత..పేదల గుడిసెలు కూల్చివేత

Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 13 Jun 2023 11:50 AM IST
Officials Remove Huts Near Mahabubabad Collectorate
X

Mahabubabad: మహబూబాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత..పేదల గుడిసెలు కూల్చివేత

Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 255/1లోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. గుడిసెలను తొలగించకూడదని.. స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అధికారులు, పోలీసులకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనకు దిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story