ఆర్డీవో కార్యాలయంలో దారుణం.. వీఆర్ఏతో స్వీపర్ పనులు చేయిస్తున్న అధికారులు

RDO Office: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

Arun Chilukuri
Published on: 18 April 2022 5:37 PM IST
Officers Doing Sweeper Work With VRA Prashanth
X

ఆర్డీవో కార్యాలయంలో దారుణం.. వీఆర్ఏతో స్వీపర్ పనులు చేయిస్తున్న అధికారులు

RDO Office: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో హౌజ్ కీపింగ్ సిబ్బంది లేకపోవడంతో ఓ వీఆర్ఏ చేత క్లీన్ చేయిస్తున్నారు ఇక్కడి అధికారులు. భోయినిపల్లి మండల కేంద్రం వీఆర్ఏగా పనిచేస్తున్న ప్రశాంత్ ఉన్నతాధికారుల ఆదేశంతో ప్రతిరోజు ఉదయాన్ని వేములవాడ ఆఫీస్ క్లీన్ చేస్తూ విధులకు వెళ్తున్నారు.

ఆలస్యంగా వెలుగులోకొచ్చిన రెవెన్యూ అధికారుల నిర్వాకం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. ఓ కిందిస్థామయి ఉద్యోగితో ఉన్నతస్థాయి అధికారులు ఇలాంటి పనలు చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే వేములవాడలో కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయంలో సిబ్బంది కొరతే కాదు వసతులు కూడా అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story