Hyderabad: గచ్చిబౌలి రెడ్స్టోన్ హోటల్ లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య..

Nursing student was brutally murdered at Gachibowli Redstone Hotel
x

Hyderabad: గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్‌లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య..

Highlights

Hyderabad: రేప్ చేసి హత్య చేశారని ఆరోపిస్తున్న కుటుంబసభ్యులు

Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రెడ్‌స్టోన్‌ హోటల్‌లో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. హోటల్‌లోని ఓ గదిలో నర్సింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం కలకలం రేపుతోంది. మృతురాలిని జడ్చర్లకు చెందిన శృతిగా గుర్తించారు పోలీసులు. అయితే తమ కూతుర్ని రేప్ చేసి చంపేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మృతురాలు గతంలో యశోద హాస్పిటల్‌లో పనిచేసినట్లు గుర్తించారు. కాగా నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన ఆమె ప్రస్తుతం జాబ్ సెర్చింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories