Yummy Dishes Coronavirus patients : కార్పోరెట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు పౌష్టిక ఆహారం

Yummy Dishes Coronavirus patients : కార్పోరెట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు పౌష్టిక ఆహారం
x

ప్రతీకాత్మక చిత్రం

Highlights

Yummy Dishes Coronavirus patients : కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన రోగులకు ఇప్పటి వరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సాధారణ ఆహారాన్నే అందించేవారు. కానీ...

Yummy Dishes Coronavirus patients : కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన రోగులకు ఇప్పటి వరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సాధారణ ఆహారాన్నే అందించేవారు. కానీ ఇప్పుడు వారికి సరైన పౌష్టికాహారం అందించేందుకు సరికొత్త మెనూని మార్చాయి. తమ ఆసుపత్రులలో చేరిన కోవిడ్ -19 రోగులకు వివిధ రకాల వంటకాలు, స్నాక్స్, సూప్, పండ్లు, పండ్ల రసాలతో పాటు ప్రత్యేకమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ ఆస్పత్రులు మాంసాహార వంటకాలను ఎప్పుడూ ఉపయోగించలేదు, కానీ మహమ్మారి బారిన పడిన వారికి పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో కొత్త ప్రాధాన్యతను ఇచ్చింది. కొన్ని ఆస్పత్రులు చేపలు, చికెన్ వంటి కూరలను అందిస్తున్నాయి. అంతే కాదు ప్రతిరోజు రోగులకు తప్పనిసరిగా ఉడికించిన గుడ్లను మెనూలో భాగంగా అందించేందిస్తున్నారు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం మీద ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాదు ఆసుపత్రుల్లో రోగుల అభిరుచులకు లోబడి ఆహారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగానే నాన్-వెజ్ వంటలను అందించే నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ఆస్పత్రులు మాత్రం మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పన్నీర్ తో చేసిన వంటలను అందిస్తున్నాయి.

కరోనా చికిత్స సమయంలో రోగులకు వివిధ రకాల యాంటీ-వైరల్ ఔషధాలు, స్టెరాయిడ్లు ఇస్తూ రోగులు ఆకలిని పెంచుతున్నారు. అందువల్ల వారికి అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్, విందు సమయంలో మంచి పోషకాహారాన్ని అందిస్తున్నారు. ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం వల్ల కార్పొరేట్ ఆస్పత్రులు రోజుకు రూ .550 నుండి 1,200 రూపాయల వరకు ఆహార ఛార్జీలుగా వసూలు చేస్తున్నాయి. రోగులకు ఇచ్చే వైద్యానికి రోజుకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతున్నారు. అందుకే వారి ఆకలి బాధలను తీర్చేందుకు వారు వెనక్కి తగ్గడం లేదు. కొంతమంది రోగులు డైటీషియన్లు చెప్పిన విధంగా ఆహారాన్ని తీసుకుంటున్నారు. రోగి డయాబెటిక్, డయాబెటిస్ లేనివాటిని బట్టి వారు అధిక ప్రోటీన్ సాధారణ ఆహారం, అధిక ప్రోటీన్ మృదువైన ఆహారాన్ని అందిస్తున్నారని ప్రముఖ డైటీషియన్, వెల్నెస్ నిపుణులు పేర్కొన్నారు. రోగులకు ఇచ్చే ఆహారంలో రోజుకు ఆహార కూర్పు సుమారు 2,000 నుండి 2,600 కేలరీలు, 60 నుండి 80 గ్రాముల ప్రోటీన్ ఉండాలని తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories