logo
తెలంగాణ

CM KCR: త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం...

Notifications for 40,000 jobs in Telangana soon Says CM KCR
X

CM KCR: త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం...

Highlights

CM KCR: తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 35వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్.

CM KCR: తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 35వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్. మరో 40 వేల ఉద్యోగాలను త్వరలోనే ప్రకటించబోతున్నామన్నారు. 317 జీవో గొప్పదని..దాన్ని వ్యతిరేకించే వాళ్లను తరిమికొట్టాలన్నారు కేసీఆర్. జీవో 317పై ప్రతిపక్షాలది అంతా తప్పుడు ప్రచారమే అన్నారు. స్థానిక నిరుద్యోగుల‌కు 317 జీవో వ‌ల్ల ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయి అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

దేశాన్ని కాపాడుకునే భాధ్యత ప్రజలు, యువతదే. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఆర్థిక అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ తెలంగాణ. ఈసారి రూ.30వేల కోట్ల అదనపు రాబడి వస్తోంది. కరోనా అతలాకుతలం చేసినా పురోభివృద్ధి సాధిస్తున్నాం అని సీఎం అన్నారు. జర్నలిజం పేరుతో సోషల్‌ మీడియాలో పిచ్చిరాతలు రాస్తే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు.

Web TitleNotifications for 40,000 jobs in Telangana soon Says CM KCR
Next Story