Komatireddy Rajagopal Reddy: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం.. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది

Komatireddy Rajagopal Reddy: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 31 Aug 2022 7:30 PM IST
Not possible to Prevent my Victory in by-elections Says Rajagopal Reddy
X

Komatireddy Rajagopal Reddy: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం.. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది

Komatireddy Rajagopal Reddy: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందన్న ఆయన అందుకే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. మరో ఆరు నెలల్లో మునుగోడులో ఎన్నికలు రాబోతున్నాయన్న ఆయన ఈ ఎన్నికలలో తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. తన రాజీనామా వృధాగా పోలేదన్న ఆయన అందుకు ప్రభుత్వం చేస్తున్న పనులే ఉధాహరణ అని గుర్తు చేశారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట్ గ్రామం నుండి ప్రచారం ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ భూటకపు మాటల పైన ప్రజలకు నమ్మకం పోయిందన్న ఆయన రాష్ట్రం అభివృద్ది కావాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story