Fake Doctor: సికింద్రాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు.. టెన్త్ చదివి డాక్టర్ అవతారం.. నకిలీ వైద్యుడి అరెస్ట్

North Zone Commissioner Task Force In Hyderabad Arrested Fake Doctor Who Is Running Geetha Clinic
x

Fake Doctor: సికింద్రాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు.. టెన్త్ చదివి డాక్టర్ అవతారం.. నకిలీ వైద్యుడి అరెస్ట్

Highlights

Fake Doctor: పదవతరగతి చదివి వైద్యుడిగా అవతారం

Fake Doctor: సికింద్రాబాద్‌లో నార్త్ జాన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నకిలీ వైద్యుడ్ని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తుహిన్ కుమార్ తుకారాంగేట్ లో గీతా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. 2012లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ డాక్టర్ దగ్గర శిక్షకుడిగా చేరి పైల్స్ చికిత్సకు సంబంధించి శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. 2016లో నగరానికి వచ్చి ఎలాంటి అనుమతి పత్రాలు, వైద్య వృత్తిని అభ్యసించిన ధృవ పాత్రలు లేకుండా క్లీనిక్ తెరిచాడని పోలీసులు తెలిపారు. తుహిన్ కుమార్ ను అరెస్ట్ చేయడంతో పాటు చికిత్సకు ఉపయోగిస్తున్న మందులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories