కాకతీయ యూనివర్శిటీలో నాన్‌ బోర్డర్స్‌ వీరంగం

వరంగల్‌ అర్బన్ కాకతీయ యూనివర్శిటీలో నాన్‌ బోర్డర్స్‌ వీరంగం సృష్టించారు. స్పోర్ట్స్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ చాంబర్‌లో నాన్‌బోర్డర్స్ విద్యార్థులను చితకబాదారు.

Arun Chilukuri
Published on: 30 Oct 2020 1:30 PM IST
కాకతీయ యూనివర్శిటీలో నాన్‌ బోర్డర్స్‌ వీరంగం
X

వరంగల్‌ అర్బన్ కాకతీయ యూనివర్శిటీలో నాన్‌ బోర్డర్స్‌ వీరంగం సృష్టించారు. స్పోర్ట్స్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ చాంబర్‌లో నాన్‌బోర్డర్స్ విద్యార్థులను చితకబాదారు. స్పోర్ట్స్‌ విభాగంలో అమ్మాయిలకు ట్రాక్‌ షూట్స్‌ పంపిణీ విషయంలో వివాదం స్టార్ట్ అయింది. స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ను ప్రశ్నించినందుకే బయటి వ్యక్తులతో దాడి చేయించారని బాధితుల ఆరోపించారు. బాధితుడు వర్శిటీ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు డైరెక్టర్ సురేష్ లాల్పై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఆందోళనలుకు సిద్ధమవుతుండడంతో కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యాజమాన్యం సైతం తగిన చర్యలను సిద్ధమవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story