Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసు.. చీటింగ్‌తో పాటు ఆర్మ్స్‌ యాక్ట్ కింద కేసులు నమోదు

Chikoti Praveen: ఏ1గా చికోటి ప్రవీణ్, ఏ2 సుందర్‌నాయక్, ఏ3 రాకేష్..

Shekhar G
Published on: 19 July 2023 12:49 PM IST
Non Bailable Case Against Chikoti Praveen Kumar
X

Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసు.. చీటింగ్‌తో పాటు ఆర్మ్స్‌ యాక్ట్ కింద కేసులు నమోదు 

Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. చీటింగ్‌తో పాటు ఆర్మ్స్‌ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. లాల్‌ దర్వాజ బోనాల్లో ప్రైవేట్‌ సెక్యురిటీతో చికోటి ప్రవీణ్‌ ఆలయానికి రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. చికోటి ప్రవీణ్‌కు సంబంధించిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి లైవ్ రౌండ్స్, మూడు రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకోవడంతో చికోటి ప్రవీణ్‌తో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏ1గా చికోటి ప్రవీణ్‌ను చేర్చారు. ఏ2 గా సుందర్‌నాయక్, ఏ3గా రాకేష్, ఏ4గా రమేష్‌గౌడ్‌‌ను చేర్చారు. ముగ్గురు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. చికోటి ప్రవీణ్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story