Telangana Speaker: స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana Speaker: స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి మద్దతుగా బీఆర్ఎస్‌

Shekhar G
Published on: 13 Dec 2023 12:27 PM IST
Nomination For Election of Telangana Speaker
X

Telangana Speaker: స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana Speaker: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్. కొత్తగా కొలువుదీరనున్న శాసనసభకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున స్పీకర్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. కాసేపట్లో ఆయన అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్‌ను అందించనున్నారు. ఈ నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు పలువురు విపక్ష నేతలు హాజరుకానున్నారు. ఇక స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి బీఆర్ఎస్‌ కూడా మద్దతు తెలపనుంది. పలువురు విపక్ష నేతలు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గననున్నారు.

Shekhar G

Shekhar G

Next Story