Thummala Nageswara Rao: ఈ సీజన్లో యూరియా కొరత లేదు

Thummala Nageswara Rao: ఈ సీజన్లో యూరియా కొరత లేదు
x
Highlights

Thummala Nageswara Rao: రాష్ట్రంలో ప్రస్తుత సాగు సీజన్‌లో యూరియా కొరత ఏమాత్రం లేదని, రైతులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Thummala Nageswara Rao: రాష్ట్రంలో ప్రస్తుత సాగు సీజన్‌లో యూరియా కొరత ఏమాత్రం లేదని, రైతులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం శాసన మండలి సమావేశాల్లో భాగంగా యూరియా పంపిణీ, లభ్యతపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

యూరియా నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం కొందరు కావాలనే లేని కొరతను సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. "కొన్ని కేంద్రాల వద్ద దుకాణాలు తెరవకముందే రైతులు ఆతృతతో క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఈ దృశ్యాలను చూపిస్తూ రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు" అని తుమ్మల దుయ్యబట్టారు.

రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో యూరియా నిల్వలను సిద్ధంగా ఉంచామని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తోందని, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, శాంతియుతంగా తమకు కావాల్సిన ఎరువులను పొందే వెసులుబాటు ఉందని ఆయన పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories