Rythu Bandhu: కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు నో రైతుబంధు

No Rythu Bandhu for New Applicants in Siddipet
x

Rythu Bandhu: కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు నో రైతుబంధు

Highlights

Rythu Bandhu: భూ సమస్యలను పరిష్కరించుకున్నారు.

Rythu Bandhu: భూ సమస్యలను పరిష్కరించుకున్నారు. సక్రమంగా రిజిస్టేషన్ చేసుకున్నారు. ఆన్‌లైన్ చేసుకొని పట్టా పాసుబుక్కులు పొందారు. సంబంధిత అధికారులకు అర్హత పత్రాలు అందజేశారు. కానీ పెట్టుబడి కోసం రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. కొత్త వారికి రైతుబంధు అందడం లేదంటున్న రైతుల కష్టాలపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

సిద్ధిపేట జిల్లాలో పలువురు రైతులకు రైతుబంధు బ్యాంకులో జమ కావడం లేదు. వారసత్వంగా వచ్చిన భూమికి పట్టా మార్పిడి జరిగినా... కొనుగోలు భూములకు సంబంధించిన భూ యజమానులు కొత్త పాసుబుక్కులు పొందినా.... రైతుబంధు పథకానికి అర్హత పొందలేదు.. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు అధికారులకు సమర్పించినా ఎందుకు నిధులు జమ కాలేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సుమారుగా 8 వేల నుంచి 10 వేల మంది వరకు కొత్త పాస్ బుక్కులు పొందిన భూ యజమానులు ఉన్నారు.. వారికి రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అందడం లేదు.. అయితే ప్రభుత్వం ముందే చెప్పినట్లుగా గత డిసెంబర్ 20 నుంచి దరఖాస్తు చేసుకున్నారు.. కానీ నెలరోజులు గడుస్తున్నా రైతుబంధు అందలేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బీమా కూడా వర్తించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న రైతుబంధు నిధులను కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా జమ చేయాలని కోరుకుందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories