ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ.. ముందే అభ్యర్థులను..

CM KCR Press Meet: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది.

Arun Chilukuri
Published on: 1 Feb 2022 8:31 PM IST
No Plans to Go for Early Polls Says CM KCR
X

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ.. ముందే అభ్యర్థులను..

CM KCR Press Meet: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లామని, ఆ అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తమకు 103 సీట్లు ఉన్నాయని, ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతామని కేసీఆర్ ప్రశ్నించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 95 నుంచి 100 స్థానాలు వస్తాయని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికలకు ఆరు నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తమ దగ్గర బ్రహ్మాండమైన మంత్రం ఉందని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story